Medaram Jathara Song 2022

Lyrics: Yashpal Music: Ronni Adams రేలా రేలా రేలారే రేలా రేలా రేలారే రేలారే రేలారే రే... 1. పల్లవి:- వచ్చే వచ్చే వచ్చేనమ్మా పచ్చని వనం పల్లే జాతర దేనాదే రేనా.. దేనాదే రేనా.. కొండా కోనా వెండీ మెరుపై మేడారమే మెరిసేనమ్మా రేలారే రేలా.. రేలారే రేలా.. పరాయి పీడన పాలనకు పోరుబీజం నాటినా సిరస్సులిచ్చిన వీరులకిక్కడ జాతరా... గోండూ గుస్సాడి డోలూ దెబ్బలు అడవీ గద్దే దద్దారిల్లగ సమక్క సారక్క ఊరేగింపుగ వచ్చెరా... రండన్నో దరువులతో ఆటలతో పాటలతో కిన్నెర వీణ నెమలి కన్నుల ఎదురుకోళ్ళ మొక్కులతో బంగారం బెల్లంతో సీరా రైక కానుకతో తల్లీ గాజులు పసుపూ కుంకుమ పాలా టెంకాయ పల్లెంతో సమ్మక్క సారక్క గద్దెక్కెరో పగిడిద్దరాజే ఎదురొచ్చెరో ఆదివాసుల జాతరరో అడవికి పూసిన వెన్నెలరో
2. చరణం :- తెల్లతెల్లగ వారొచ్చే తెరతెరలుగ తరలొచ్చే సంతోషాలే.. మా సంబురాలే.. ఒకరినొకరు ఒరుసుకునీ గుడారాలు పరుచుకునీ జంపన్నాలో.. జలకాలాడే.. హే చెట్టులు పుట్టలు గుట్టలుగా నిన్నే భావించీ పానా సారం భక్తితో నిన్నే పూజించీ ధనికులు పేదలు నీదరికొచ్చి నిద్రలు చేయంగా సబ్బండ కులాల సంబరాలే అంబరమంటంగా హే రారండో దరువులతో ఆటలతో పాటలతో కిన్నెర వీణ నెమలి కన్నుల ఎదురుకోళ్ళ మొక్కులతో సమ్మక్క సారక్క గద్దెక్కెరో పగిడిద్దరాజే ఎదురొచ్చెరో ఆదివాసుల జాతరరో అడవికి పూసిన వెన్నెలరో 3. చరణం :- వనమంతా మేల్కొలిపీ జగమంతా నడిపించే మహా జన్మరో.. మా జేజమ్మారో.. పుడమెవ్వరి సొత్తనీ మొక్కెవ్వరి విత్తనీ వాధించేరో.. బోధించేరో.. ఏ జాతీ మతం కులం లేదని మాలో చూపించీ పుట్టే గిట్టే మనుషుల మధ్య భేదం తొలగించీ
మట్టికి దండం బెట్టిన మనుషుల ఒక్కటిగావించీ నాలుగు దిక్కుల భక్తుల కిక్కడ ముక్తిగావించీ హే రారండో దరువులతో ఆటలతో పాటలతో కిన్నెర వీణ నెమలి కన్నుల ఎదురుకోళ్ళ మొక్కులతో సమ్మక్క సారక్క గద్దెక్కెరో పగిడిద్దరాజే ఎదురొచ్చెరో ఆదివాసుల జాతరరో అడవికి పూసిన వెన్నెలరో 4. చరణం :- వీరత్వం, ధీరత్వం, దైవత్వం, శూరత్వం నేర్పినావులే.. ముందు నడిపినావులే.. ఆకలిగొన్నా జనులకు అర్థానాదాలు వినీ కడుపులు నింపీ.. మాకు అమ్మయినావూ.. ఏ చిలుకల గుట్టా మేడారం హంసల గధ్దెక్కీ నీ రూపు చూస్తే చాలు ఇక జన్మ తరించే మిర్రీ మిర్రీ చూసే యువకుల మరుగున రప్పించీ వరుసా గలిపీ పడుచూ జంటల ఒక్కటి గావించే హే రారండో దరువులతో ఆటలతో పాటలతో కిన్నెర వీణ నెమలి కన్నుల ఎదురుకోళ్ళ మొక్కులతో సమ్మక్క సారక్క గద్దెక్కెరో పగిడిద్దరాజే ఎదురొచ్చెరో ఆదివాసుల జాతరరో అడవికి పూసిన వెన్నెలరో
5. చరణం :- నీ శౌర్యమె ఆ శిఖరం నీ ధైర్యమె ఈ అఖిలం ఈ ధరణిలో.. ధన్య వీరవనితవూ.. వాగులు వంకలు పొంగీ కొండలు కోనలు దాటి చిరుగాలిలో.. పేరు తిరుగాడేనే.. ఏ సత్తికి మత్తికి సఖ్యత లేదని నీవే రప్పించీ కోపం తాపం తొలగించీ సంతానం ప్రాప్తించే నీ ఊరికి వస్తే చాలూ జనం పూణకమూగులే... తూరుపు దిక్కున వెలుగుతున్న పరంజ్యోతివే... హే పెర్సాపేన్, ముండాపేన్, అకీపేన్, అవ్వాపేన్ జంగూబాయి, నాగోబా, కొర్రాజూల, జెల్లాదేవ్ సమ్మక్క సారక్క గద్దెక్కెరో పగిడిద్దరాజే ఎదురొచ్చెరో ఆదివాసుల జాతరరో అడవికి పూసిన వెన్నెలరో