Ee Kshanam Okeoka Korika

ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా..
ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. తరగని దూరము లో ఓ .. ఓ.... తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా..
~ సంగీతం ~
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది.. ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది.. నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక .. ఆరాటంగా కొట్టుకున్నది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా..
~ సంగీతం ~
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది.. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి .. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..
ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..
ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ .. నిద్దరోను అంటోంది..
ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. తరగని దూరము లో ఓ .. ఓ.... తెలియని దారుల లో ఓ .. ఓ....
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..