Lyrics: Purnachary
Music: Kalyan Keys
పల్లవి: పొద్దు తిరుగోలే ఏం సక్కని పిలగాడే
ముద్దబంతి నవ్వే ఆ మోమున దాచాడే
సింత సిగురల్లె ఓ కొంత వగురుగాడే
సొంతదాన్ని చూసే యే తీరిక లేనోడే
రంగోలి రంగుల హోలీ…
నా బంగారు గాజుల కేళీ...
గుండెల్లో నిండు దీవాలి...
ఆడి సూపుల్లో ఉంది జాబిలి…
1.చరణం: గట్టుపొంట నే పోతుంటే….
మడి కట్టి కుసుంటాడే
బుట్ట నెత్తికెత్తోయై అంటే
పడనట్టూ పోతుంటాడే
కాదు అనే అంటాడు నా పైన ప్రేమను
సాటుగానే చూస్తాడు నన్నెప్పుడూ
నాదస్వరం నా గొంతు ఆటాడుట నా వంతు
"రంగోలి రంగుల హోలీ"
2.చరణం: పట్టు చీరలో నే వస్తే…..
నా చుట్టూ వాడి సూపులు
ఎడ్ల బండిపై పోతుంటే
నా వెనకే వాడి పరుగులు
ఊపిరిలో ఉంటాడు నా రాజు ఎప్పుడూ
సైగలతో సేపుతాడు ఆ మాటను
రాజసమే ఉన్నోడు ఈ నేల సూరీడు
"రంగోలి రంగుల హోలీ"