Lyrics: Krishna Kanth Music: Krishna Kanth రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచు వాన నన్ను ముంచెనంట వానవిల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంటా ఈ లోకమంతా నిన్ను చూసెనంటా ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యెనే ఇలా   ఎంతందమో నీ లోకమే ఎంతైనా ఈ హాయి కలనే కదా నీ రాకనే నాకో కలా కలలేవో నిజమేదో తేల్చేదెలా ఏ హద్దులు ఆపనే లేని ప్రేమంటే నీదే కదా ఓ గుండెలో దాచలేని ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యెనే ఇలా