Sivangi Pilla (From "Pandem Kodi 2")

Lyrics: Chandrabose Music: Yuvanshankar Raja శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే పీచు మిఠాయి పెదవే అరె పీల్చుతోంది నా ఎదనే పామల్లే ఊగే నడుమే అరె పెంచెను గుండె దడనే అరెరెరెరె పొట్టేలు లాంటి పిల్లాన్ని కాలి పట్టీగ మార్చావే అరె నాటు కొడవలి లాంటి నాతో కూరలు తరిగావే వదిలేసి వెళ్లకే నిద్దర రాదే కళ్లకే శివంగి పిల్లా ఏయ్ ఏయ్ శివంగి పిల్లా ఏయ్ ఏయ్ శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
పైటలో గాలులే పంచెనే శ్వాసలే నోటిలో మాటలే పాయసం మూటలే అడుగుల జాడలే హంసల మేడలే కళ్ళలో కాంతిని అడిగి వెలిగెను చూడే సూర్యుడే మావూరి సాయబు అత్తరులాగా చొక్కాకు అంటేశావే అరె కొరమీను చేపల వాసనలాగా బుర్రంత నిండేశావే వదిలేసి వెళ్లకే ముల్లై మనసును గిల్లకే శివంగి పిల్లా ఏయ్ ఏయ్ శివంగి పిల్లా ఏయ్
చెప్పని మాటలే కంటికే వినబడే చెయ్యని చేతలే గుండెకే కనబడే పొందని అలజడే ఎందుకో అలవడే చెవులలో దుద్దుల్లాగా హృదయాన్నూపేశావులే బంగాళదుంపలు బాగా దోచి చెంపల్లో దాచేశావే అరె పంచ వన్నెల చిలకలు నేసిన పావడ చుట్టేశావే వదిలేసి వెళ్లకే నాపై పిడుగులు చల్లకే శివంగి పిల్లా ఏయ్ శివంగి పిల్లా ఏయ్ శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే శివంగి పిల్లా ఏయ్ ఏయ్ శివంగి పిల్లా ఏయ్ శివంగి పిల్లా ఏయ్ శివంగి పిల్లా ఏయ్ ఏయ్ శివంగి పిల్లా