Lyrics: Kristen Anderson-Lopez/Robert Lopez
Music: Kristen Anderson-Lopez/Robert Lopez
ఎల్సా: అల్లకల్లోలంగా ఉంది
గుండె లోతుల్లో
ఏవేవో స్వప్నాలు
కంటి మీదనున్నా తీరలేవా?
లోలోన తోచే తెలిసున్న నేస్తంలా
దొరికేనా? కదిలోచ్చేనా ఇల్లే?
మహరాజినే నేపైనా
నా జన్మే మర్యాదా?
నీలో దాగున్న మర్యాదే విప్పేవా?
కనపడు! వచ్చా నిను చూడ
కనపడు, ఇన్నాళ్ళు
కనులు చూడగా వేచిన ఆశే నీవా?
రా ఇటు, నేనస్సీ వింటా
అ-అ-అ-అ
అ-అ-అ-అ
నే వేదనెంతో చూశా అన్సీ దాటే వచ్చా
ఈ రోజు కోసమే వచో జన్మే నాది ఉంది ఇందుకేనా?
నేనన్సిటా ప్రత్యేకమే
నియమాలు తెలియవులే
గమ్యానిలా నమ్మానుగా, నీ దారి చేరానుగా?
రా ఇటు! కళ్లోలమింక లేదు!
దూరాలే తెగించే వచ్చా!
బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు!
ఒ, రా ఇటు! నువ్వు ఎదురుగా రా!
రావా ఇలా, నాపై పగా?
నేనుండను ఇంకే క్షణం
ఒ, రావా ఇలా, నాపై పగా?
నేనుండను ఇంకే క్షణం!
బృందగానం: హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలదీ
ఇడునా: బంగారు తల్లీ, వచ్చావా
ఎల్సా: కనుగొన్నా!
ఎల్సా & ఇడునా: రా ఇటు! శక్తే చూపించు
ఎదుగింకా కొత్త మెరుపులతో!
ఇడునా: దొరికగా నీకే నువ్విలా
-ఎల్సా: బ్రతుకంతా! -ఇడునా: బ్రతుకంతా!
ఎల్సా: ఒ రా ఇటు!
ఇడునా: నువ్వు(అ-అ)
అ-అ-అ-అ
అ-అ-అ-అ!!